Friday, March 28, 2025

ఇంకా కోలుకోని శ్రీ తేజ

- Advertisement -

ఇంకా కోలుకోని శ్రీ తేజ
హైదరాబాద్, మార్చి 14, (వాయిస్ టుడే )

Sri Teja, who has not yet recovered

ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృ‌ష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా.. మనస్పూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన మొత్తం సినిమా యూనిట్‌‌కు షాపంగా మారింది. ఒక్క ఇన్సిడెంట్‌తో వాళ్ల సినిమా సక్సెస్ అంతా గాల్లో కొట్టుకుపోయింది. అంత పెద్ద హిట్ అయినా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు బన్నీ అండ్ బ్యాచ్. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది.. ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్నుంచి ఆ కుర్రాడు హాస్పిటల్‌లోనే ఉన్నాడు. పుష్ప 2 ప్రీమియర్‌ తొక్కిసలాట జరిగి మూడు నెలలు దాటినా కూడా ఇంకా అలాగే ఉన్నాడు శ్రీతేజ్.ఈ కుర్రాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరా తీస్తున్నాడు కానీ ఏం చేస్తాం తేజ్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ కుర్రాడిలో ఉలుకు పలుకు లేదు. హాస్పిటల్ బెడ్డుపై అలాగే పడున్నాడు. ఆయన కోసం చేయని వైద్యం లేదు.. రాని వైద్యుడు లేడు.. అవసరం అయితే ఫారెన్ కూడా ఓకే అంటున్నారు బన్నీ టీం. కానీ లాభం లేకుండా పోతుంది. కుర్రాడు కళ్లు తెరిచి చూస్తున్నా ఎవర్నీ గుర్తు పట్టట్లేదు శ్రీతేజ్. ఆకలి లేదు.. పైకి లేచి కూర్చునే పరిస్థితి లేదు.. ఈ రోజుకు కూడా ఆహారాన్ని కేవలం పైపులతోనే అందిస్తున్నారు కానీ సొంతంగా తీసుకోలేకపోతున్నాడు ఈ అబ్బాయి. ఇప్పటికీ మూడు నెలలు అయింది.. ఇంకా ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేకపోతున్నారు వైద్యులు. అసలేమైంది అని ఆరా తీస్తే చాలా సమస్యలే బయటపడుతున్నాయి. తొక్కిసలాట జరిగినప్పుడు బ్రెయిన్‌కు చాలా సేపు రక్త ప్రసరణ ఆగిపోవడంతోనే అసలు సమస్యలు వచ్చాయంటున్నారు డాక్టర్లు.ఆ షాక్‌తోనే శ్రీతేజ్ ఆరోగ్యం ఓ పట్టాన మెరుగుపడటం లేదని.. అప్పుడప్పుడూ కళ్లు తెరుస్తున్నా చలనం లేకుండానే ఉన్నాడంటున్నారు వైద్యులు. ఇది కోమా కాని కోమా అంటున్నారు వాళ్లు. ఆస్పత్రికి తరలించిన తర్వాత రక్త ప్రసరణ జరిగేలా చూసినా కూడా అప్పటికే మెదడుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు ఆ కుర్రాడు. ఉన్నారు. ఆ తర్వాత బయటికి వచ్చినా కూడా లాభం లేదు. శ్రీతేజ్‌ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని తపిస్తున్నారు బన్నీ టీం. అవసరమైతే విదేశీ వైద్య నిపుణుల సాయం తీసుకోవాలంటున్నారు. కావాలంటే ఫారెన్ కూడా వెళ్లండి.. మేం కూడా తోడుగా వస్తామంటున్నాడు అల్లు అర్జున్. పైగా బన్నీ వాస్ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్‌కు వచ్చి కుర్రాడి గురించి ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతానికైతే శ్రీతేజ్ ఇంకా అచేతనంగానే ఉన్నాడు.. త్వరలోనే ఆ అబ్బాయి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్