స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు & శిరీష్ నిర్మాణంలో ఆశిష్ హీరోగా ఆదిత్యరావు గంగాసాని దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మైల్ స్టోన్ 60వ మూవీ అనౌన్స్‌మెంట్
Sri Venkateswara Creations Milestone 60th Movie Announcement, Directed by Aditya Rao Gangasani, Starring Ashish, Produced by Dil Raju & Sirish
ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్ ని సూచిస్తుంది. ఈ మూవీలో రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సెట్ చేయబడింది, ఆశిష్ లోకల్ గాయ్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్ తో ఇంటెన్స్ ని యాడ్ చేస్తోంది. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్, ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నారు. మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్ లో కనిపించబోతున్నారు.డెబ్యు డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని ఈ సినిమా కోసం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథని రెడీ చేశారు. ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్ గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్ ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్ గా వుంటుంది. ఇది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి గొప్ప అవకాశం అందిస్తుంది. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ గల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరోసారి హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ గల చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.