Thursday, February 12, 2026

లోంకకేసారం గ్రామంలో శ్రీధర్ బాబు ప్రచారం  

- Advertisement -

కమాన్పూర్: రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో సోమవారం మంథని ఎమ్మెల్యే గా శ్రీధర్ బాబు ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ,రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని ప్రజలకు తెలిపారు . ఆరు గ్యారంటీ లో బాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500,గ్యాస్ సిలిండర్ 500 రూపాయిలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు . గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నట్లు,యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పింఛన్ ద్వారా ఆసరా పెన్షన్  4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని,రైతు బరోసా పథకం ద్వారా రైతులకు రూ.15000, కౌలు రైతులకు రూ .12000 అందించనున్నట్లు ప్రజలకు వివరిస్తూ శ్రీధర్ బాబు ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మంథని ఎమ్మెల్యే గా శ్రీధర్ బాబు ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కన్నూరి  శ్రీనివాస్, నాంసాని సందీప్,అనవెని శ్రీనివాస్, బొయిని కొమురయ్య, గెల్లు క్రాంతి, బోయిని శ్రీధర్, ఒర్రే కిరణ్ యాదవ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్