కమాన్పూర్: రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో సోమవారం మంథని ఎమ్మెల్యే గా శ్రీధర్ బాబు ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ,రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని ప్రజలకు తెలిపారు . ఆరు గ్యారంటీ లో బాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500,గ్యాస్ సిలిండర్ 500 రూపాయిలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు . గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నట్లు,యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పింఛన్ ద్వారా ఆసరా పెన్షన్ 4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని,రైతు బరోసా పథకం ద్వారా రైతులకు రూ.15000, కౌలు రైతులకు రూ .12000 అందించనున్నట్లు ప్రజలకు వివరిస్తూ శ్రీధర్ బాబు ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మంథని ఎమ్మెల్యే గా శ్రీధర్ బాబు ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కన్నూరి శ్రీనివాస్, నాంసాని సందీప్,అనవెని శ్రీనివాస్, బొయిని కొమురయ్య, గెల్లు క్రాంతి, బోయిని శ్రీధర్, ఒర్రే కిరణ్ యాదవ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లోంకకేసారం గ్రామంలో శ్రీధర్ బాబు ప్రచారం
Published By Voice Today Team
221
- Advertisement -
- Advertisement -
- Tags
- congress leader sridhar babu
- congress mla sridhar babu
- congress sridhar babu
- duddilla sridhar babu
- manthani congress mla sridhar babu
- manthani mla sridhar babu
- mla sridhar babu
- mla sridhar babu interview
- mla sridhar babu joins brs
- mla sridhar babu latest interview
- mla sridhar babu news
- mla sridhar babu songs
- mla sridhar babu speech
- mla sridhar babu wife
- sridhar babu
- sridhar babu speech
- sridhar babu vs putta madhu
- telangana congress mla sridhar babu



