Tuesday, March 17, 2026

స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా “ప్రేమకథ” సినిమా ట్రైలర్ రిలీజ్

- Advertisement -

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ప్రేమకథ”. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. “ప్రేమకథ” చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మంగళవారం సాయంత్రం “ప్రేమకథ” సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం మాట్లాడుతూ – “ప్రేమకథ” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. మా సినిమా ట్రైలర్ చూశారు. మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఏ సినిమా ఫేట్ అయినా మీరు డిసైడ్ చేయాల్సిందే. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరి. “ప్రేమకథ” మిమ్మల్ని ష్యూర్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

హీరోయిన్ దియా సితెపల్లి మాట్లాడుతూ – తెలుగులో నా మొదటి సినిమా “ప్రేమకథ”. ఈ చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. ఫస్ట్ మూవీ కాబట్టి నేను సెట్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. రెగ్యులర్ లవ్ మూవీస్ కు మా సినిమా భిన్నంగా ఉంటుంది. మీ అందరు సపోర్ట్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. అని చెప్పింది.

యాక్టర్ వినయ్ మహదేవ్ మాట్లాడుతూ – ప్రేమ కథ సినిమాలో నేను యాదవ్ అనే క్యారెక్టర్ చేశాను. మీరు ట్రైలర్  లో చూసినట్లు ఇందులో ఒక 50 నుంచి 60 మందితో ఒక ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ లో ఫైటర్స్ ఎవరూ లేకుండా మొత్తం యాక్టర్స్ తోనే చేశారు. ఈ ఫైట్ మూవీకి ఒక హైలైట్ అవుతుంది. మా హీరో ఇవాళ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ట్రైలర్ రిలీజ్ కు రానందుకు బాధపడుతూ ఫోన్ చేశాడు. దాదాపు అందరూ కొత్తవాళ్లమే. అయినా ప్రతి ఒక్కరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. అన్నాడు

యాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ – గిరి అన్న ద్వారా నాకు “ప్రేమకథ” సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ విజయ్ అన్నకు, డైరెక్టర్ శివశక్తి గారికి థ్యాంక్స్. మేమంతా ఫ్రెండ్స లా టీమ్ వర్క్ చేశాం. “ప్రేమకథ”తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ – “ప్రేమకథ” సినిమాను దాదాపు అంతా కొత్తవాళ్లతో నిర్మించాం. థియేటర్ నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్స్ మా సినిమాలో నటించారు. మాకు వర్థన్ దేవరకొండ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, శింగనమల కల్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇవాళ మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా ప్రమోషన్స్ కు సపోర్ట్ చేసి ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ చేసిన హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్స్ హరీశ్ శంకర్, హనురాఘవపూడి, మారుతి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక జెన్యూన్ లవ్ స్టోరితో మా “ప్రేమకథ” సినిమాను నిర్మించాం. మీ అందరి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటీనటులు – కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరుల

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్