గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
State government is standing by the families of Gulf workers
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ని.వ నవంబర్ 27
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు సందరగిరి రమేష్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రొసీడింగ్ పత్రం చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం అందజేశారు.
గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన సందరగిరి రమేష్ అబుదాబి పనిచేస్తూ గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. వీరిది నిరుపేద కుటుంబం కావడం, ఆస్తిపాస్తులు లేకపోవడం తో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారు అయ్యారు.
స్థానిక నాయకుల వీరి కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే సత్యం బాధిత కుటుంబ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రూ. 5 పరిహారం మంజూరు చేయించారు.శనివారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో మంజూరి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి, అనివార్య కారణాలతో అక్కడే మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఎన్నారై పాలసీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు బాదిత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పురుమల్ల మనోహర్, దొమకొండ మహేష్,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, మ్యాక వినోద్, సురేష్, కార్తిక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.