- Advertisement -
గిరి బలిజ జీ ఓ 5 స్టేటస్ కో ను స్వాగతించి న రాష్ట్ర కాపు జేఏసీ
జీ ఓ 5 పూర్తిగా రద్దు చేయాలనీ డిమాండ్ చేసిన చందు జనార్దన్
జీ ఓ 7 ను తెచ్చిన సీఎం. డిప్యూటీ సీఎం, నారా లోకేష్, సానా సతీష్ కు ధన్యవాదా లు – జేఏసీ
కాపు బలిజ వర్గ సమస్య లను తీర్చాలని డిమాండ్ చేసిన. జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్
విజయవాడ..అక్టోబర్ /3
State Kapu JAC welcomes Giri Balija GIO 5 status quo
దొమ్మరులను గిరి బలిజ గా మార్చిప్రభుత్వం ఇచ్చిన జీ ఓ నెంబర్ 5 పై స్టేటస్ కో ఇచ్చి జీ ఓ 7 ను ఇవ్వడాన్ని రాష్ట్ర కాపు జె ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ స్వాగతి స్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ శుక్రవారం విజయవాడ లో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో చందు జనార్దన్ మాట్లాడుతు కూటమి ప్రభుత్వం పెద్దలు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఊముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి వర్యులు టీడీపీ అది నేత నారా లోకేష్ , బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత , ఆశాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ కి, రాజ్య సభ సభ్యులు సా నా సతీష్కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
గిరి బలిజ పేరు తో బలిజ, కాపు వర్గాలను అవమానించారని, కులం చాలా అవమానానికి గు రయ్యిందని చందు జనార్దన్ ఆవేదన వ్యక్తం చేసారు.కాపు వర్గాల సమస్య లు అనేకం ఉండగా కొత్త సమస్య లను తెస్తున్నారని దశాబ్దాల నుండి ఉన్న సనస్యలు వెంటనే పరిష్కారం చూపాలని ప్రభు త్వనికి చందు జనార్దన్ విజ్ఞప్తి చేసారు.
కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ఉన్న సమస్య బీసీ రిజర్వేషన్ కు పరిస్కారం చూపాలని, కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చెయ్యాలని, కాపు భవనాల నిర్మాణం పూర్తి చెయ్యాలని,కృష్ణ జిల్లాకు స్వర్గీయ వంగవీటి మెహన రంగా గారి నామకరణం చెయ్యాలని, జనాభా దమాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో, రాజకీయ పదవుల్లో ప్రా ధాన్యత నివ్వాలని, డిమాండ్ చేసారు.
ఉద్యోగులు గా ఉన్న కాపు లకు ప్రాధాన్యత గల స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కోరారు.
బీసీ రెసర్వేషన్, ఇతర సమస్య ల పరిష్కకోసం రాష్ట్ర కాపు జేఏసీ నిరంతరం గా ఉద్యమం కొనసాగుతుందని అందు లో భాగంగా అన్నిజిల్లాలో సమావేశం లు పర్యటన ల అనంతరం బీసీ రెసర్వేషన్, సమస్య ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చందు జనార్దన్ తెలిపారు.
గిరి బలిజ 5 తొలగించాలని జరిపిన ఉద్యమానికి మద్దతు తెలిపి న శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఉద్యోగుల సంఘం కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ కి, కాపు ఉద్యోగులకు, టీచర్లకు,రాయలసీమ బలిజ సంఘ నాయకులకు, కర్నూల్, అనంతపురం, నంద్యాల, పుటపర్తి, కడప, గుత్తి, గుంతకల్లు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చితూర్ బలిజ సంఘ నేత లందరికి ఉద్యమ వందనాలు తెలిపిన చందు జనార్దన్,
జీ ఓ 5 ఉప సంహారణ కోసం సమాలోచన లు జరిపిన మాజీ సీ ఎస్ రామమోహన్ , కే న్ కుమార్ , మెండు చక్ర పని , పీవీరావు , ఏ వీ రత్నం , కటారి అప్పారావు , గాళ్ళ సుబ్రహ్మణ్యం కి ధన్యవాదములు తెలిపారు.
జీ ఓ 7 ను తెచ్చేందుకు సమన్వయము చేసిన రంగిశెట్టి మంగబాబు కి, జీ ఓ ను తెచ్చిన సోదరులు పెద్దలు సానా సతీష్ రాజ్యసభ సభ్యులు కి ఉద్యమభి వందనాలు
ఈ మీడియా సమావేశం లో ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, కడప జేఏసీ నాయకులు సమతం రాము, చందు భావనా రాయణ, కేటీనీడు భాస్కర్, రాధా రంగా మిత్రమండలి ముళ్ళపూడి నాగేశ్వరరావు, సుంకర సాంబశివరావు, చందు భావన్నారాయ, పంచకర్ల రాంబాబు, ఆటో నగర్ అధ్యక్షులు రాజనాల బాబ్జి,తోట సంబశివరావు,కొండి శెట్టి రాజేంద్ర, ప్రయివేట్ స్కూల్స్ సంగం అధ్యక్షులు సాయి, రాష్ట్ర సెక్యూరిటీ అధ్యక్షులు సుమన్, కంది నాయుడు, పెన్నేరు దామోదర్, కటకం ధర్మారావు, గంటా సాయి వరప్రసాద్,ఎర్రం శెట్టి అంజిబాబు,ఆకుల తిరుమల రావు, జొన్న రాజేష్,,వెంకట, నానాజీ,పురం శెట్టి బాబ్జి, కుటుంబరావు,లు పాల్గొన్నారు
- Advertisement -


