ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పిలుపు
నంద్యాల: ఐక్యమత్యంతోనే గిరిజనుల అభివృద్ధి ఈనెల 10వ తేదీన విజయవాడలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై గిరిజనుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పేర్కొన్నారు.
శుక్రవారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులంతా ఏకమై ఐక్యమత్యంతో ఉంటే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గిరిజన హక్కుల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కోసం గిరిజనుల జీవన ప్రమాణాలు రూపొందించడానికి గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు తప్పనిసరిగా పాల్గొని అత్యవసర ఆత్మీయ సమావేశానికి హాజరుకావాలని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, వైసిపి జోనల్ ఇన్చార్జి, జిపిఎస్ గౌరవ సలహాదారుడు బి శంకర్ నాయక్, జి వి ఎస్ రాయలసీమ ఇంచార్జి రవీంద్రా నాయక్, జిపిఎస్ మహిళా అధ్యక్షురాలు ఇండ్ల ఉషారాణి, దేవేంద్ర నాయక్, విక్రమ్ నాయక్ శివుడు నాయక్ మరియు తదితరులు ఉన్నారు.



