పేద ప్రజలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
State Minister Duddilla Sridhar Babu is standing with the poor people
-అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా
-రెండు లక్షల 50వేల ఎల్వోసి పత్రాలు అందజేత
మంథని
పేద ప్రజలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలుస్తున్నారు.అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారేపల్లి గ్రామానికి చెందిన పెస్తం అంజమ్మ కు గుండె వైద్య చికిత్సకు సంబంధించిన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతు సహాయం కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను సంప్రదించగా వెంటనే స్పందించిన మంత్రి ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల 50 వేల ఎల్వోసి మంజూరు చేయించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు శుక్రవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్వోసి పత్రాలను అందజేశారు. రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కు అంజమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.