పేద ప్రజలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
State Minister Duddilla Sridhar Babu is standing with the poor people
-అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా
-2 లక్షల 50 వేల ఎల్వోసి మంజూరు చేయించిన మంత్రి
మంథని
పేద ప్రజలకు అండగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిలుస్తున్నారు.అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా కల్పిస్తున్నారు. మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలoలోని మీనాజిపేట గ్రామానికి చెందిన గంగవేణి శ్రీనివాస్ అనారోగ్య వైద్య చికిత్సకు సంబంధించి నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే స్పందించిన మంత్రి ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల 50వేల ఎల్వోసి మంజూరు చేయించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు శుక్రవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్వోసి పత్రాలను
అందజేశారు. 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కు గంగవేణి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.