Sunday, September 8, 2024

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమే

- Advertisement -

ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ప్రధాని మోదీ

రాష్ట్రంలో 60 శాతం మంది బీసీలు

బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రిజర్వేషన్ దక్కుతుంది

బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌ కు రాజ్యాంగ బద్థతా

జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రజాపతి

మెదక్:  బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రజాపతి పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో  బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో 60 శాతం పైగా  బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రిజర్వేషన్ దక్కుతుందన్నారు. 70 ఏళ్ల  కాంగ్రెస్ పాలనలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్థత కల్పించలేదని,.. బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ బద్థతా కల్పించిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. బడుగులంతా ఏకమైతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదని ఆయన స్పష్టం చేశారు. బీసీలు ఐక్యంగా తమ ఓటు హక్కుతో సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది రహస్య బ్యాలెట్‌ అని మీరు ప్రతి ఒక్కరూ మీ ఆత్మసాక్షిగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యధిక శాతానికి పైగా ఉన్న బడుగులంతా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, హర్యానా మేయర్ మధన్ చౌహాన్,  బీసీ సంఘాల మహిళ రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ,నాగ పరిమిల, వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్ష,  కార్యదర్శులు  బెండ వీణా, మంజుల, మాయ శంకర్, రమేష్ గౌడ్, బండ నరేందర్, గొల్ల పవన్ కుమార్, రవీందర్ చారి, శ్రీనివాస్ చారి, బైండ్ల సత్యనారాయణ,విప్లవ్ కుమార్, సుభాష్ గౌడ్, వినయ్ జైస్వాల్,  జ్వాల సాయిబాబా, ప్రసాద్ యాదవ్, నర్సింలు, సోమ కృష్ణ, నంగి పవన్ తోపాటు వేలాది బీసీలు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్