బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం : సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్

- Advertisement -

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం

మున్నూరుకాపుల ఐక్యతతో బలహీన వర్గాల హక్కుల సాధన

సంఘటితంగా ముందుకు సాగుతూ రాజకీయ ప్రాతినిధ్యం సాధించాలి: రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్

ఖమ్మం, అక్టోబరు 28: వాయిస్ టుడే 

మున్నూరుకాపులంతా ఐక్యంగా, సంఘటితంగా ముందుకు సాగుతూ ఇతర బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా ప్రయాణం సాగించాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్ పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బీసీలు ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే ఐక్యతే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు.

ఖమ్మంలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో బుధవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ, జిల్లా అనుబంధ సంఘాల విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల సమయంలో బీసీల మద్దతు కోరే రాజకీయ పార్టీలు అధికార పంపిణీ, నిర్ణయాధికారంలో మాత్రం తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేశారు.

మున్నూరుకాపుల జనాభా వాటాను తక్కువగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరుకాపులకు అవకాశం కల్పించకపోవడం తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఓట్లు మావి.. ఎన్నికల కష్టాలు మావి.. కానీ అధికారంలో వాటా మాత్రం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.

రాజ్యాధికారం అంటే కేవలం పదవులు పొందడం మాత్రమే కాదని, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో తమ గొంతుక వినిపించడం, విద్య, ఉద్యోగ, రాజకీయ

ఐక్యతే బలం.. రాజ్యాధికారమే లక్ష్యం!మున్నూరుకాపుల ఉద్యమానికి ఖమ్మం వేదికగా కార్యాచరణ
ఐక్యతే బలం.. రాజ్యాధికారమే లక్ష్యం!
మున్నూరుకాపుల ఉద్యమానికి ఖమ్మం వేదికగా కార్యాచరణ

రంగాల్లో తగిన వాటా సాధించడం, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందేలా పోరాడటమేనని వివరించారు. మున్నూరుకాపులు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

ఖమ్మం మేయర్ పదవి బీసీలకే ఇవ్వాలి

సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. రానున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీసీలకు కేటాయించాలని, మెజారిటీ డివిజన్లలో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

యువత, మహిళలు, విద్యార్థులను సంఘ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలని, బీసీ సంఘాల మధ్య సమన్వయం పెంచి హక్కుల సాధనకు ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని తీర్మానించారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు.

అలాగే నవంబర్ 15న ఖమ్మంలోని చెరుకూరి మామిడి తోటలో నిర్వహించనున్న మున్నూరుకాపు జిల్లా వన మహా సమారాధనను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది.

ప్రముఖ నాయకుల హాజరు

జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్త సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఆవుల రామారావు పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, పందిరి వేణు పటేల్, రాష్ట్ర కోశాధికారి కంచి సత్యనారాయణ పటేల్, రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల అరుణ్ పటేల్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట నర్సయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి నేతి వెంకటేశ్వర్లు పటేల్ అతిథులుగా హాజరయ్యారు.

జిల్లా అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేందర్, కోశాధికారి మాడూరి పూర్ణచందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు పగడాల మంజుల, యువజన అధ్యక్షుడు తోట రమేష్, పట్టణ అధ్యక్షుడు పార ఉదయ్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు కొలనుపాక రమాదేవి, పార నాగేశ్వరరావు, పొదిలి రవికుమార్, మేకల భిక్షమయ్య, పసుపులేటి నాసరయ్య, మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ల కృష్ణ, పాలేరు నియోజకవర్గ అధ్యక్షుడు మరిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మున్నూరుకాపుల ఐక్యతతో పాటు అన్ని బలహీన వర్గాలను కలుపుకొని సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన దిశగా సంఘం ఉద్యమాన్ని మరింత విస్తరించాలని సమావేశం ఆకాంక్షించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular