చెడు వ్యసనాలకు  దూరంగా ఉండాలి

- Advertisement -

చెడు వ్యసనాలకు  దూరంగా ఉండాలి

Stay away from bad addictions 

తాండూర్ సిఐ కుమారస్వామి
—-
యువతకు దిశా నిర్దేశం

ఓటమికి గెలుపు తొలి మెట్టు కావాలి

తాండూర్
నేటి తరం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు. గురువారం రోజున మాదారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో టిపిఎల్ ప్రీమియర్ లీగ్ యాక్ష న్ పోటీలను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు.అంతరించిపోతున్న ఆటలను మర్చిపోకుండ ఉండేందుకు ఇలాంటి పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. చదువుతోపాటు ఆటల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని శ్రద్ధగా చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కొనియాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని ఓడినవారు నిరుత్సాహపరకుండా విజయం వైపు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో  నిర్వహకులు మైదం అనిల్ కుమార్, మాసాడి శశివర్ధన్, సాలిగామ శివ, అలీమ్ ఖాన్, మిట్ట వెంకటస్వామి, సహన కిరణ్,సల్మాన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular