- Advertisement -
డ్వాక్రా మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి
Steps should be taken to train Dwakra women as aspiring entrepreneurs
కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి
పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధిపై రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడారు.
రాష్ట్రంలో వివిధ సామాజిక ఫించన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకు సాంకేతిక, హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్తో అనర్హులను తొలగించాలి. ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలను పూర్తిగా నివారించాలని అన్నారు.
సర్టిఫికెట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా పరిశీలించాలి. ఎక్కడైనా సదరం సర్టిఫికెట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం. ఉపాధి నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలి. 100 రోజుల పనులు పూర్తి చేస్తే మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు వస్తాయి. వాటితో వేగవంతంగా పనులు పూర్తి చేయొచ్చు. 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేశాం. మరో రూ.1100 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి.
రాష్ట్రంలో సుమారు 80వేల కి.మీ లు గ్రామీణ రహదార్లు ఉన్నాయి. మేజర్ పంచాయితీ రోడ్లు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో అంతర్గత రహదారులు అభివృద్ధి సంతృప్తికరంగా ఉందని సియం సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటింటా చెత్త సేకరణ వంటి కనీస సౌకర్యాలు కల్పించడం పంచాయితీల బాధ్యతని అన్నారు.
15వ ఆర్థిక సంఘం, సీనరేజీ తదితర నిధులు సమీకరించి పనులు చేపట్టాలని సియం చంద్రబాబు కలెక్టర్లుకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పధకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వంలో ఆ పనులన్నీ పూర్తిగా మొదలు పెట్టాం. డ్వాక్రా మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. సుమారు 30 ఏళ్ళుగా స్వయం సహాయక సంఘాల మహిళలు కేవలం పొదుపు చేయడం, బ్యాంకు రుణాలు తీసుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికే పరిమితం అయ్యారు. ఇకపై ప్రతీ డ్వాక్వా మహిళను ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సియం స్పష్టం చేశారు.
- Advertisement -