Friday, February 27, 2026

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

- Advertisement -

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock markets in huge gains
ముంబై, ఫిబ్రవరి 3

భారత స్టాక్ మార్కెట్‌ రెండు రోజుల కిందట భారీ నష్టాలు చవిచూడగా.. నేడు ఫిబ్రవరి 3న భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. బడ్జెట్ రోజు ఇన్వెస్టర్ల లక్షల కోట్లు కోల్పోగా, నేడు వారంలోని రెండవ ట్రేడింగ్ రోజున నిఫ్టీ, సెన్సెక్స్ సహా దాదాపు అన్ని స్టాక్స్ గ్రీన్ మార్కులోకి వస్తున్నాయి. ప్రీ మార్కెట్ ప్రారంభంలో కూడా స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది. నేడు ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ 50 భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 25 శాతంగా ఉన్న టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించారు. దాని కారణంగానే భారత స్టాక్ మార్కెట్ నేడు లాభాల్లో దూసుకెళ్తోంది.30 షేర్లతో కూడిన BSE సెన్సెక్స్ సూచీ 3656.74 పాయింట్లు లేదా 4.48 శాతం పెరిగి 85,323.20 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1219.65 పాయింట్లు లేదా 4.86 శాతం పెరిగి 26,308.05 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:25 గంటల వరకు, సెన్సెక్స్ 2407 పాయింట్లు పెరిగి గరిష్టంగా 84,073 పాయింట్ల వద్దకు చేరింది. అదే సమయంలో నిఫ్టీ 50 760 పాయింట్లు పెరిగి 25,848 కి చేరి కాస్త పడిపోయింది. 10.30 గంటలకు సైతం నిఫ్టీ 50, సెన్సెక్స్
BSE టాప్ గెయినర్స్
ఈరోజు బీఎస్ఈలో అదానీ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, రిలయన్స్, ఇండిగో షేర్లు భారీగా పుంజుకున్నాయి.
భారత్‌పై టారిఫ్ తగ్గించిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడిన కొద్దిసేపటికే, డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఒప్పందాన్ని ప్రకటిస్తూ పోస్ట్ చేశారు. ఆయన భారత ప్రధానిని ప్రశంసించారు. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని, చాలా తక్కువ మొత్తంలో కొనుగోళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ ఇకనుంచి వెనిజులా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత స్టాక్ మార్కెట్‌లో, ఫిబ్రవరి 2న ట్రేడింగ్ రోజున ఉదయం నష్టాల్లోకి వెళ్లగా.. మధ్యాహ్నం నుంచి సూచీలు బలపడ్డాయి.  రెండు ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 943.52 పాయింట్లు లేదా 1.17 శాతం పెరిగి 81,666.46 పాయింట్లకు చేరుకోగా, NSE నిఫ్టీ 50 262.95 పాయింట్లు లేదా 1.06 శాతం పెరిగి 25,088.40 స్థాయి వద్ద ముగిసింది.BSE నుండి పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్, రిలయన్స్, మహీంద్రా & మహీంద్రా, ఇండిగో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాప్ లూజర్ల గురించి మాట్లాడితే, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, TCS మరియు ట్రెంట్ ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ 100, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ FMCG మరియు నిఫ్టీ ఆటో షేర్లలో వృద్ధి కనిపించింది.అదే సమయంలో నిఫ్టీ IT షేర్లలో క్షీణత ఉంది. సోమవారం ట్రేడింగ్ రోజున BSE బాస్కెట్ నుండి 25 షేర్లు లాభాలతో ముగియగా, 5 షేర్లలో నష్టం నమోదైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్