- Advertisement -
రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాను
Storm to hit Tamil Nadu coast in two days
విశాఖపట్నం
నైరుతీ బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతోంది. నేడు తుపాను గా మారుతూ 2 రోజుల్లో తమిళ నాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షా లు కురుస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు.
- Advertisement -