Monday, December 23, 2024

నీటి వనరుల పటిష్టతను నిరంతరం పర్యవేక్షించాలి

- Advertisement -

నీటి వనరుల పటిష్టతను నిరంతరం పర్యవేక్షించాలి

Strength of water resources should be continuously monitored

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి

జిల్లాలోని వరదల నేపథ్యంలో చెరువులు, కుంటలు ఇతర నీటి వనరులలో నీటి నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వరదలు, నీటి వనరుల నిర్వహణ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జే.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి  సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ చిన్న నీటిపారుదల రంగం పరిధిలో ఉన్న చెరువులు, కుంటలలో ప్రస్తుత నీటి నిల్వలు, వస్తున్న వరద ను అంచనా వేయాలని, చెరువు కట్టల పటిష్టతను పరీక్షించి అధికారులు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, మత్తడి దూకే చెరువులు, కుంటల కారణంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురై అవకాశం ఉంటే వెంటనే సదరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. మహారాష్ట్రలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ గోదావరి నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుందని, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నీటిని విలువలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నీటికి దిగువకు విడుదల చేయాలని, వరద నీరు విడుదల చేస్తున్న సమయంలో కింద మత్స్యకారులు, గొర్రె కాపరులు మొదలగువారు ఉండకుండా చూడాలని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన పరిస్థితులలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, పునరవాస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో  పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశా లత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్