పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్ జనవరి 4
పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జగిత్యాల జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా నాయకులు గురువారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.జడ్పీచైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌పై వస్తున్న అవిశ్వాస తీర్మానం) పూర్తి అబద్దమని , పూర్తి పదవికాలం పాటు ఆమెనే కొనసాగుతారని జడ్పీటీసీలు కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -