Thursday, March 26, 2026

ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు..

- Advertisement -

తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు
ర్యాగింగ్ చేయడం నేరం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు..                                                    పోలీస్ కమిషనర్ డాక్టర్. బి. అనురాధ

Strict action will be taken if there is ragging.

సిద్దిపేట
పోలీస్ కమిషనర్ బి. అనురాధ  మాట్లాడుతూ. తోటి విద్యార్థిని విద్యార్థులను మరియు జూనియర్లను  ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్ అనేది ఒక విష సంస్కృతి అని దాని జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దని ఇది అత్యంత అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదు అని తెలిపినారు.  ర్యాగింగ్ చేయడం నేరమని, విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారు, వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు మొదట తాము చదువుకోవడానికి కళాశాలలకు వస్తున్నామని మరియు తల్లిదండ్రులు చదివించడానికి పడుతున్న కష్టాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. సరదాలకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సీనియర్లు ఆదేశించినప్పటికీ, ఫ్రెషర్లు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం మానుకోవాలి, విద్య సంస్థల యజమానులకు పిర్యాదు చేయాలని అన్నారు.
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు నిర్వహించాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించడం జరిగినదని తెలిపినారు. యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలని తెలిపినారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు, పిల్లలు తల్లిదండ్రులు మంచి పేరుప్రతిష్టలను తేవాలి అని కోరారు. ర్యాగింగ్ చట్టప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ర్యాగింగ్ చట్టప్రకారం రెండు విధాలుగా అమలు చేయవచ్చని మొదట కాలేజీ యాజమాన్యం కాలేజీ నుండి  సస్పెండ్ మరియు రిమూవ్ చేసే అధికారం ప్రిన్సిపల్ గారికి ఉంటుందని తెలిపారు. రెండవది ర్యాగింగ్ చేసిన వ్యక్తుల పై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ర్యాగింగ్ అనగా వ్యక్తులను, వ్యక్తిని అవమానపరచుట, భయపెట్ట, భయం కలిగేటట్లు చేయుట వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన. కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు.  తెలిసీ తెలియని వయస్సులో సిగరెట్, గుట్కా, గంజాయి లాంటి  మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని తెలిపారు. మీరు ఎంచుకున్న గోల్ ను దృష్టిలో ఉంచుకొని చదువుతూ ముందుకు వెళ్లాలని ఎన్ని కష్టాలు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇష్టపడి చదువుతూ మీరు ఏర్పరుచుకున్న గోల్ సాధించాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మహానుభావులైన గొప్ప గొప్ప వ్యక్తుల బయోగ్రఫీ పుస్తకాలు చదవాలని వాటి ద్వారా సమాజం గురించి జీవితం గురించి మనం ఏర్పరుచుకున్న గోల్ గురించి ఒక అవగాహన వస్తుందని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్