నాని ‘ప్యారడైజ్‌’ ప్రీ సేల్స్ జోరు

- Advertisement -

నాని ‘ప్యారడైజ్‌’ ప్రీ సేల్స్ జోరు
Strong pre-sales for Nani’s ‘Paradise’
హైదరాబాద్ సెప్టెంబర్ 17
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలతో సందడి చేయనుంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ప్యారడైజ్‌’ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే లక్ష డాలర్ల మార్కును దాటి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. మధ్యలో బుకింగ్స్ కాస్త నెమ్మదించినా, విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ల కోసం ఇప్పటివరకు 15,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా ప్రీ-సేల్స్ రూపంలోనే 350K (సుమారు రూ. 3.35 కోట్లు) డాలర్ల వసూళ్లు దాటినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాని సినిమాలకు మొదటి నుంచి యూఎస్‌లో మంచి మార్కెట్ ఉండటంతో, ‘ప్యారడైజ్‌’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘ఏషనాగుల’ పాట
ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ పాట యూట్యూబ్‌లో కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎలాంటి ట్రైలర్ లేకుండానే ఈ సినిమా నేరుగా థియేటర్లలోకి రానుంది. సినిమాపై ఉన్న నమ్మకంతోనే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ప్రీ-సేల్స్ మరింత పెరిగి, ‘ప్యారడైజ్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular