ఉనికి కోసం పోరాటం…
హైదరాబాద్, జూన్ 28,
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి 2023 నవంబర్ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే.. పార్టీలోని సీనియర్ నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో పారీ‍్ట ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మూడు రోజుల వ్యవధిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్ పార్టీని వీడారు.ఒకవైపు కండువా మార్చిన నేతలపై చర్యలకు బీఆర్‌ఎస్ లీగల్‌గా సిద్ధమవుతుండటంతోపాటు ఆయా ఎమ్మెల్యేలకు నిరసన తగిలేలా ఆందోళనలకు సిద్ధం అవుతుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో మొదలైన ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. మొదట పార్టీ ఫిరాయించాడు. దీంతో మొదలైన ఫిరాయింపు ప్రస్తుతం ఐదు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై రాహుల్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. మీ పార్టీ వీడితే చర్యలకు పట్టుబడుతున్నారు.. ఒక రాష్ట్రానికి ఒక రూల్ ఉంటుంది? మరో రాష్ట్రానికి మరో రూల్ ఉంటుందా? అని కాంగ్రెస్‌ను నిలదీసేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ.ఇదే సమయంలో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేలా బీఆర్‌ఎస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జీలను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీలో కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో కిందిస్థాయి క్యాడర్‌తో కేసీఆర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
ఉనికి కోసం పోరాటం…
- Advertisement -
- Advertisement -