వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను అధైర్య పడకుండా ప్రోత్సహించాలి
ప్రతీ మంగళవారం స్పెషల్ ఆఫీసర్లు వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లను విజిట్ చేయాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జగిత్యాల
వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అధైర్య పడకుండా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి ఆనంతరం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్ లతో జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ళ నిర్వహణపై కలెక్టర్ అదనపు కలెక్టర్ దివాకరతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెల్ఫేర్ హాస్టళ్ళను, రెసిడెన్షియల్ స్కూళ్ళ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసామని, కానీ కొంతమంది ఆఫీసర్లు మాత్రమే తమకు రిపోర్ట్ ఇస్తున్నారని, మిగతా అధికారుల నుండి ఎటువంటి రిపోర్ట్ తమకు రావడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రతీ మంగళవారం స్పెషల్ ఆఫీసర్లు వెల్ఫేర్ హాస్టళ్ళను, రెసిడెన్షియల్ స్కూళ్ళను తప్పకుండా సందర్శించాలని, విద్యార్థులకు మనమే ఒక సపోర్ట్ సిస్టమ్ లా ఉండాలని పిల్లలు ఎలా చదువుతున్నారు, హాస్టళ్ళలో ఎం జరుగుతున్నది అన్ని విషయాలను తెలుసుకొని తమకు రిపోర్ట్ పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని పరీక్షలలో ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించాలని పరీక్షలే జీవితం కాదని కలెక్టర్ తెలిపారు. అలాగే వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు మోటివేషన్ తరగతులు, విద్య పట్ల అవగాహన తరగతులు నిర్వహించాలని అన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం జరుగుతున్న ప్రదేశాలు తనిఖి చేయాలని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకు పిల్లలు చాలా సెన్సిటివ్ అయి వారి ప్రాణాలను తీసుకుంటున్నారని, అలా జరుగకుండా హాస్టల్స్ లో పిల్లలకు ఏదైనా సమస్య ఉంటె వార్డెన్లతో షేర్ చేసుకోవాలని, వారికి ఫ్రీ కౌన్సిలింగ్ ఇప్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.