
ఆన్‌లైన్ లో దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, జూలై : నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, న్యూఢిల్లీ 2024 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి 31 ఆగస్టు 2023 చివరి తేదీ అని NDMA సభ్య కార్యదర్శి కమల్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ https://awards.gov.in లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు మరియు సంస్థలు చేసిన విశేషమైన కృషి గుర్తించడానికి భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరుతో వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులలో రూ.51 లక్షల విలువ గల 3 అవార్డులుతో పాటు, సంస్థ లేదా వ్యక్తిలకు రూ. 5 లక్షల, నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
