పెద్ధపల్లి కోటాలో “కాకా” వారసుడి గెలుపు
ఎంపీగా వంశీకృష్ణ ఎన్నిక పట్ల హర్షం
జగిత్యాల,
పెద్ధపల్లి పార్లమెంట్ సభ్యులుగా యువనాయకులు గడ్డం వంశీకృష్ణ ఎన్నికకావడం పట్ల జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గట్టు గంగారాం, గాదే ప్రభాకర్, బుర్ర
రమేష్, కనకయ్య, చల్ల తిరుపతి, గడ్డం నారాయణ, ధమ్మ లక్ష్మణ్ తదితరులు హర్షం ప్రకటించారు. పెద్ధపల్లి స్థానం నుండి కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు మనవడు
వంశీకృష్ణలు మూడు తరాల వ్యక్తులు ఎంపీలుగా గెలవడం పెద్ధపల్లి గడ్డం వంశానికి కంచుకోటగా నిలిచిపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జగిత్యాల లో మాట్లాడుతూ
“కాకా” వారసుడిగా
ఎన్నికల్లో పోటీచేసిన
మొదటి సారి భారీ విజయాన్ని వంశీకృష్ణ సొంతం చేసుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పెద్ధపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు ,కాంగ్రెసు పార్టీ శ్రేణులు మండు వేసవిలో ఎంపీ అభ్యర్థి గెలుపుకోసం విస్తృత ప్రచారం నిర్వహించడం మూలంగా వంశీకృష్ణకు భారీ మెజార్టీ వచ్చిందని అన్నారు.
వంశీకృష్ణ
గెలుపుతో పెద్ధపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి ఆవకాశాలు లభిస్తాయని దాంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం
వ్యక్తంచేశారు.