- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థాన ధర్మకర్త మధు సాగర్, నాయకులు సాయి గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



