కాంగ్రెస్ కు ద్రోహం చేసిన సుదీర్ రెడ్డి… నీ చిల్లర రాజకీయాలకు బయపడం
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, వాయిస్ టుడే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త మాంసాల మీద గెలిచిన సుదీర్ రెడ్డి కార్యకర్తలను మోసం చేసి కాంగ్రెస్ కు ద్రోహం చేయడమే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీకి వస్తున్న తనపై దొంగబుద్ది చూపిస్తూ రౌడీలు, గుండాలచే దొంగసాటు ఫోటోలు,వీడియోలు తీపిస్తు తనను సుధీర్ రెడ్డి బదునాం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఘాటుగా విమర్శించారు.ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మదుయాష్కీ మాట్లాడుతూ నేను ఎన్ కౌంటర్ లకే భయపడలేదు సుధీర్ రెడ్డికి బయపడుతానా అన్నారు.తన చుట్టూ తన కార్యకర్తల చుట్టూ గుండాలతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని తాను ఎవరిని కలుస్తున్న ఏ నాయకున్ని కలుస్తున్న అని దొంగచాటున ఫొటోస్,వీడియోలు తీయిస్తున్నట్లు ఆరోపణలు చేశారు.తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేసేందుకు వచ్చానని ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడనని అన్నారు.నేను గెలిస్తే నాకు రాజకీయ వారసులు లేరని కార్యకర్తలు నా రాజకీయ వారసులన్నారు.తనకు సహకరిస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి,దర్పల్లి రాజశేఖర్,వజీర్ ప్రకాష్ గౌడ్, జితేందర్ రెడ్డి,గజ్జి భాస్కర్ లకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాయమని సుధీర్ రెడ్డి అక్రమాల పుట్ట తొవ్వుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి,ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, మకుటం సదాశివ, లింగాల కిషోర్, బుద్ధ సత్యనారాయణ, గజ్జి శ్రీనివాస్ యాదవ్, రమేష్ నాయక్, మల్లారపు శ్రీనివాస్, సీతారాం, ఎస్కే జానీ పాషా,యోగేశ్వర్ రెడ్డి గజ్జి భాస్కర్ జైపాల్ రెడ్డి కావేరి,గుర్రం శ్రీనివాస్ రెడ్డి,సుజాత,గజ్జి భాస్కర్,కృపాకర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, శైలజ రెడ్డి, డేరంగుల కృష్ణ, యువ నాయకులు సామ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.