GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ తొలి పాట ‘సూఫియానా..’ విడుదల..
ఆకట్టుకుంటోన్న మెలోడి సాంగ్
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి
కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఆయ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి
మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.. అలాగే ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్‌లో మరింత వేగాన్ని పెంచుతూ ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునేలా మెలోడి ఆఫ్ ది సీజన్ అనిపించేలా
‘సూఫియానా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేయగా పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సూపర్ హిట్ పాటలకు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం.
‘సూఫియానా..’ సాంగ్‌ను రామ్ మిర్యాల, సమీర భరద్వాజ్, రమ్యశ్రీ పాడారు. ప్రముఖ పాటల రచయిత శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. చక్కగా అందరికీ అర్థమయ్యేలా ఈ లిరికల్ సాంగ్
ఆకట్టుకుంటోంది.
అందమైన లొకేషన్స్, బ్యాగ్రౌండ్‌తో అలరించే గోదావరి అందాలు, నార్నే నితిన్, నయన్ సారిక మధ్య కనిపిస్తోన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను మైమరపింప చేస్తుంది. సింపుల్ కొరియోగ్రఫీలో ‘సూఫియానా..’ మెలోడి సాంగ్
అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది. నితిన్, నయన్ సారిక జోడి సిల్వర్ స్క్రీన్‌పై చూడ చక్కగా ఉంది. ఈ సాంగ్ అందరి ప్లే లిస్టులో మొదటిస్థానంలో ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనటంలో సందేహం
లేదు.
‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్
ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా,
రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
GA2 పిక్చర్స్:
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా,
ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.
నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు