బాక్సాఫీసు దగ్గర చిరు, రజనీలు సూపర్

హైదరాబాద్, ఆగస్టు 11, వాయిస్ టుడే: బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ కనిపిస్తుంది. ఇద్దరు పెద్ద హీరోలు.. ఎవ్వరి ఫ్యాన్స్ తక్కువకాదు. ఒక్కరోజు గ్యాప్ లోనే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. ఇంతకు ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనుకుంటున్నారా.. ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్, మరొకరు మెగాస్టార్ చిరంజీవి. ఇద్దరు స్నేహితుల సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదలైంది. అలాగే చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా (ఆగస్టు 11న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తుంది. నిన్న రిలీజ్ ఆయిన జైలర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మామూలుగానే రజినీకాంత్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
ఆ క్రేజ్ కారణంగానే సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబడతాయి. సూపర్ స్టార్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కలెక్షన్స్ మాత్రం క్రేజీగా ఉంటాయి. ఇక ఇప్పుడు జైలర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ కలెక్షన్స్ రెట్టింపు అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.జైలర్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుందితెలుగు స్టేట్స్ లో జైలర్ సినిమా 10 కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా జైలర్ మూవీ 72 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత రజినీకాంత్ సాలిడ్ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు భోళాశంకర్ టైం నేడు రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది.వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న చిరంజీవి. ఇప్పుడు భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అటు భోళాశంకర్ సినిమా తొలి రోజు భారీగా కలెక్షన్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ మూవీ భారీ కలెక్షన్ సాదిస్తుందని అంటున్నారు. మరి తొలి రోజు సూపర్ స్టార్ సినిమాను మెగాస్టార్ బీట్ చేస్తుందేమో చూడాలి. భోళాశంకర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే భారీగానే జరిగాయి.


