26.1 C
New York
Wednesday, June 19, 2024

గీత కార్మికులను ఆదుకోండి

- Advertisement -

గీత కార్మికులను ఆదుకోండి

పొట్లపల్లిలో కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించిన బండి సంజయ్

గీత కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్న సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొట్లపల్లి సమీపంలో కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు. అక్కడున్న గీత కార్మికులు, స్థానికులను కలిసి తాటి చెట్ల దగ్దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘గౌడన్నలు ప్రమాదవ శాత్తు చనిపోతే పైసలివ్వడం కాదు… బతికున్నప్పుడు కూడా ఆదుకోవాలి. ఉపాధి కల్పించాలి. ప్రమాదవశాత్తు తాటి చెట్లు కాలిపోతే అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’అని తెలిపారు. మద్యం షాపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం  తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గీత కార్మికుల పొట్ట కొడుతోందని విమర్శించారు. ‘‘అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది. ఒక్కటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా? ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తానన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా?. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు.?.. ఏమైంది? అధికారంలోకి వచ్చినంక అటకెక్కిస్తరు… ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. అట్లాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పండి’’అంటూ గీత కార్మికులకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!