పంటలకు మద్దతు ధర చెల్లించాలి
రైతు బంధు డబ్బులు విడుదల చేయాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల
వరి,మొక్క జొన్న పంటలకు మద్దతు ధర తోపాటు క్వింటాల్ కి రూ.500 బోనస్ ఇవ్వాలని జగిత్యాల ఎమ్మెల్యే
డాక్టర్.ఎం. సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ
మామిడి రైతులకు ఎకరా కు రూపాయలు 25 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి రైతుల పంటలను కాపాడాలని సూచించారు.రైతు బందు నిధులు విడుదల చేయాలని
ఎమ్మేల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జెడ్పిటిసి మహేష్, రూరల్
వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,నాయకులు దావా సురేష్, బీఆర్ ఎస్ జగిత్యాల రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు దుమ్మని బాల ముకుందం,జంబర్తి శంకర్
,రాజీరెడ్డి,శేఖర్ రెడ్డి, గంగారెడ్డి,హరీష్,అరిఫ్,
బిక్షపతి, లక్ష్మణ్,సతిరెడ్డి,వంశీ బాబు,ఏనుగుల రాజు,
తదితరులు పాల్గొన్నారు.