పోలీక్యాబ్ నుంచి సుప్రీమా విద్యుత్ తీగలు

- Advertisement -

పోలీక్యాబ్ నుంచి సుప్రీమా విద్యుత్ తీగలు

Suprema power cables from Polycab

సికింద్రాబాద్..
పోలీక్యాబ్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఎలక్ట్రాన్ బీమ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పాలీ క్యాబ్ సుప్రీమా విద్యుత్తు తీగలను లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల రాష్ట్ర

అధ్యక్షుడు నక్క యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పాలీ క్యాబ్ సంస్థ ఉద్యోగులు ప్యాట్ని నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాలీ క్యాబ్ ఇండియా లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్

నవీన్ సామ్యూల్ మాట్లాడుతూ అత్యుత్తమమైన అత్యధిక వేడిని సైతం తట్టుకునే విధంగా ఈ వైర్లు రూపొందించినట్లు వెల్లడించారు. గృహోపకారాలతో పాటు వ్యవసాయ ఆధారిత మోటార్లకు ఈ అధునాతన సాంకేతిక

పరిజ్ఞానంతో కూడిన వైర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇతర కంపెనీలతో పోలిస్తే పాలిక్యాబ్ ఎలక్ట్రాన్ బీమ్ వైర్లు నాణ్యతతో పాటు అధిక వేడిని తట్టుకొని ఎక్కువకాలం మన్నిక ఉంటాయని అన్నారు. భవిష్యత్తును

దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజులలో విద్యుత్ భారాన్ని తట్టుకునే విధంగా ఈ తీగలు దోహదపడతాయని అన్నారు. ఈ నూతన ఎలక్ట్రాన్ బీమ్ వైర్లను ఉపయోగించాలని వినియోగదారులకు సూచించారు. ఈ

సందర్భంగా నక్క యాదగిరి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా పాలిక్యాప్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వైర్లను రూపొందించడం జరిగిందని, వినియోగదారులు వీటిని వాడాలని ఆయన కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular