- Advertisement -
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..
Supreme Court reserved judgment on Kejriwal's bail petition.
న్యూ డిల్లీ సెప్టెంబర్ 5
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును నిరజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గురువారం సుధీర్ఘంగా విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అసలు కేజ్రీవాల్ పేరు లేదని సింఘ్వీ వాదించారు.ఇటీవల కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీఎం సమాజానికి ప్రమాదకరమేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొందని, బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని ధర్మాసనానికి తెలిపారు. ఒకసారి ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేసిందని, మరోసారి ఈడీ కేసులో బెయిల్ లభించిందని చెప్పారు. కేజ్రీవాల్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని.. సమాజానికి ప్రమాదం లేదని వాదించారు. రెండేళ్లుగా సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదని.. అయితే, జూన్ 26న మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఒకరకంగా ఇన్సురెన్స్ అరెస్ట్ అని ఆరోపించారు.సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లాలని.. నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. సీఎం ప్రత్యేకమైన వ్యక్తి అని.. అందుకు భిన్నమైన పద్ధతిని అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని ఏసీజీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు రెండో పిటిషన్‌లో బెయిల్ కోసం అప్పీల్ చేశారు. ఇంతకు ముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా కోరింది. హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది.
- Advertisement -