Thursday, March 20, 2025

 తెలుగు వర్శిటికి సురవరం.. చర్లపల్లికి పొట్టి శ్రీరాములు నేచర్ క్యూర్ కు రోశయ్య పేర్లు

- Advertisement -

 తెలుగు వర్శిటికి సురవరం..
చర్లపల్లికి పొట్టి శ్రీరాములు
నేచర్ క్యూర్ కు రోశయ్య పేర్లు

హైదరాబాద్, మార్చి 17

Suravaram for Telugu University..
Potti Sriramulu for Cherlapalli
Roshayya names for Nature Cure

తెలంగాణ శాసనసభలో నేడు 5 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, దేవాదాయ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ వర్గీకరణ బిల్లును, మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీసీ రిజర్వేషన్ల బిల్లును, మంత్రి కొండా సురేఖ దేవాదాయ చట్టసవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. ఆ బిల్లులపై కీలకంగా చర్చ జరుగుతోందిపొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువ చేయడం లేదు, ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో సూచించారు. ఆయన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చింది.పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునర్విభజన తరువాత గత 10 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని వర్గాలకు కొందరు నేతలు కొన్ని సామాజిక వర్గాల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు ఇలా చేయడం సబబు కాదు. రాజకీయాలు, నాయకుల ఆలోచనలు ఎంత కలుషితం అయ్యాయో తెలియడం లేదు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. అంటే ఇది దివంగత సీఎం ఎన్టీఆర్ ను అగౌరవపరిచడం కాదు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువ చేయడం లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో సూచించారు. ఆయన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించిందన్నారు. బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చామన్నారు.ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలుంటే పరిపాలనలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందన్నారు సీఎం. అందుకే యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నట్లు వివరించారు. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదన్నారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని అన్నారు.కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే ముమ్మాటికీ తప్పు అని అన్నారు ముఖ్యమంత్రి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని, చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుమతులు తీసుకురావాలన్నారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌కు దివంగత రోశయ్య పేరు పెట్టుకుందామని, ఆయన సేవలను కీర్తించుకునేలా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి మనం తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును మార్చుతూ సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టుకుంటున్నాం. ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలోని పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో కొత్తగా పేర్లు మార్చుకున్నాం. ఒకే పేరుతో రెండు రాష్ట్రాల్లో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనాపరంగా గందరగోళం నెలకొంటుంది. కనుక తెలంగాణలోని యూనివర్సిటీలకు, సంస్థలకు స్థానిక నేతల పేర్లు పెట్టుకుంటున్నాం. అంటే గతంలో ఉన్న పేర్లను మార్చడం, మహనీయులను అగౌరవపరచడం ఏమాత్రం కాదు. పాలనా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కొందరు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం పెద్ద తప్పు. దేశాన్ని ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిన దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో గుజరాత్ లో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పిదాలు చేయదు. ఇటీవల రీడిజైన్, అభివృద్ధి చేసుకుని ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు మహనీయుడు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం. దీనిపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతి తేవాలి. హైదరాబాద్ లోని బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు మాజీ సీఎం రోశయ్య పేరు పెడుతున్నాం. ఎన్నో పర్యాయాలు ఆయన ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య సొంతం. సీఎంగానూ ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన రోశయ్యను కీర్తించుకునేలా నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు’ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్