- Advertisement -
ఆదివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్ప్రైజ్ వాహనాల తనిఖీలు
Surprise vehicle inspections on Sundays from 7pm to 9pm
పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ
సిద్దిపేట
ఆదివారం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలవరకు ఆకస్మిక వాహనాలు కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించామని కమిషనర్ డా అనురాధ వెల్లడించారుద. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అక్రమ రవాణా నివారణ గురించి వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 89 నమోదు చేయడం జరిగిందని అన్నారు.
వాహనాల తనిఖీలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 89 నమోదు చేసాం. రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, మత్తు పదార్థాలు అక్రమ రవాణా నివారించడం గురించి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ నిర్వహించాం. తరచుగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -