Friday, January 17, 2025

ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్

- Advertisement -

ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్

Survey tension for MLAs

నెల్లూరు, జనవరి 4, (వాయిస్ టుడే)
చంద్రబాబు.. సీఎం మాత్రమే కాదు.. ఓ సీఈఓ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రొగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేల ఆరు నెలల పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ఫోకస్ చేశారు. ప్రజలకు IVRS కాల్స్ చేసి ఎమ్మెల్యేలు ఎంత వరకు అందుబాటులో ఉంటున్నారో తెలుసుకుంటున్నారు. పనితీరు బాగుంటే ఒకటి .. పర్వాలేదు అనిపిస్తే రెండు .. బాగోకపోతే మూడు ప్రెస్ చెయ్యాలని కోరుతూ ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి.పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఈ సర్వే మొదలైంది. గత ప్రభుత్వం లాగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. నాయకులు నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాబులో ఉండాల్సిందేనని అన్నారు. గతంలో టికెట్ ఇచ్చే సమయంలోనే చంద్రబాబు ఈ కాల్స్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో సర్వేల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.6 నెలల్లో మీ శాఖల పురోగతిపై మీరు రిపోర్టు ఇస్తారా? మీ రిపోర్టులు నన్నే ఇవ్వమంటారా? ఇప్పటికే చాలా సార్లు అడిగా.. అయినా మార్పు రాలేదు.. పని తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు.. ఇవి నిన్న కేబినెట్ మీటింగ్‌లో మంత్రులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.మంత్రుల పనితీరు సరిగా లేదని సీఎం ప్రధాన ఆరోపణ. పనిలో వేగం పెంచాలని.. లేదంటే జరగబోయే పరిణామాలకు తనను బాధ్యుడిని చేయొద్దని చెప్పేశారు సీఎం. పనితీరు సరిగా లేదన్నది ఒక కారణమైతే.. ఆరునెలల పనితీరుపై నివేదికలు ఇవ్వకపోవడం చంద్రబాబు కోపానికి మరో కారణం.పలుసార్లు నివేదికలు కోరినా.. రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ తప్పా మరెవ్వరూ ఇవ్వలేదు. దీంతో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరి పని తీరును తాను గమనిస్తున్నానని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఎంత వరకు సమీక్షలు నిర్వహిస్తున్నారు? సంబంధిత శాఖల్లో ఫైల్స్ ఎంత త్వరగా మూవ్ అవుతున్నాయో తన దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పారు సీఎం.సంబంధిత శాఖల్లో అధికారులు పనితీరు కూడా మంత్రుల బాధ్యతేనని సీఎం స్పష్టం చేశారు. ఎవరి పని తీరుపై వాళ్లు నివేదికలు ఇవ్వకపోతే.. తానే అందరి రిపోర్టులు బయట పెడతానని ఆయన చెప్పారు. అయితే.. మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. ఆరు నెలల నివేదికలను మంత్రి నారాలోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్