17.6 C
New York
Wednesday, May 29, 2024

-పెద్దపల్లి సీటు పక్కా బీజేపీదే అంటున్న సర్వేలు -బీజేపీకి కలిసి వచ్చిన ఓటు క్రాసింగ్

- Advertisement -

బీజేపీలో జోష్ నింపిన పార్లమెంట్ ఎన్నికలు
 
-పెద్దపల్లి సీటు పక్కా బీజేపీదే అంటున్న సర్వేలు
-బీజేపీకి కలిసి వచ్చిన ఓటు క్రాసింగ్
 
-గ్రామాల్లో వెలిగిన మోడీ చరిష్మా
 
-మోడీకి కానుకగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం
 
-బీజేపీ గెలిస్తే ఢిల్లీ దాకా మారు మ్రోగనున్న పెద్దపల్లి కీర్తి
, పెద్దపల్లి ప్రతినిధి
:  పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలు ఈసారి బీజేపీ పార్టీలో జోష్ పెంచిందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా పెద్దపల్లిలో జరిగిన ఎన్నికలు మరి మరి విశేషంగా చెప్పవచ్చు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు హిందుత్వవాదం పేరుతో మరోవైపు లౌకికవాదం పేరుతో జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి ఆయా పార్టీల నాయకులు. ఇక అసలు విషయానికి వస్తే పెద్దపెల్లి పార్లమెంటు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ శాతం తీసుకుంటే వందకు 60 మంది ఓటు వేసినా ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విశేషమేంటంటే మూడోతరం నాయకుడైన గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం. 24 ఏళ్ల యువకుడు ఇద్దరు ఉడ్డందులు, గుర్తింపు ఉన్న పార్టీలతో తలపడ్డారు. ఇటు టీఆర్ ఎస్ నుండి కాకలు తీరిన ఉద్యమ బిడ్ద, మాజీ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, మరో వైపు బీజేపీ బ్రాండ్, మోడీ చరిష్మా తో మరో సారి తన అదృష్టం పరీక్షించు కుంటున్న గోమాస శ్రీనివాస్. వీరిలో ఎవరికి వారే పలు ప్రత్యేకతలు ఉన్నా, ముఖ్యంగా ఇక్కడ చర్చించు కోవాల్సింది పార్టీల గురించే.  ఇద్దరూ సీనియర్ నాయకుల మధ్యలో ఒక యువ నాయకత్వం గెలుపు ఓటమిలో నిర్ణయించే ఓటర్ల మధ్యలో నిలబడి ఓటు వేసిన గెలుపు కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మతతత్వ బీజేపీ పార్టీ అంటూ ప్రచారం చేస్తే, బీజేపీ మాత్రం అభివృద్ధి మీదనే ప్రచారం దృష్టి సారించింది. ఇక సోషల్ మీడియా మాత్రం అన్ని మసాలలతో ఘాటుగా ప్రచారం చేసిందనే చెప్పాలి. ఇక మోడీని చూసే ఓటు వేయాలని చేసిన ప్రచారం కూడా గ్రామాల్లో సైతం బలంగా నాటుకు పోయింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రస్తుతం పెద్దపల్లిలో బీజేపీలో వర్గ పోరు కనిపించినా అది ఈసారి ఓటర్లను ప్రభావితం చేయలేక పోయింది. పెద్దపల్లిలో బీజేపీ గెలుపు ఖాయమే అనే స్థాయిలో ప్రచారం జోరుగా సాగింది. అలాగే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ ఎస్ కు బలం ఉన్నా, కేంద్రంలో ఏమి చేస్తుందనే భావన స్థానిక ఓటర్లలో కనిపించింది. యువకులు గ్రామీణ ప్రాంతం ప్రజలు కొంత వరకు బీజేపీకి ఓటు వేశారు. దీనికి తోడుగా శ్రీరామ అక్షింతల సెంటిమెంట్, హిందూ త్వ వాదన కూడా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. దీంతో కాంగ్రెస్, టీఆర్ ఎస్ అనే పార్టీలతో సంబంధం లేకుండా ఏక పక్ష తీర్పు ఇవ్వనున్నట్లు ఓటింగ్ సరళిని చూస్తే అర్ధమవుతుంది. 17 లోక సభ ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికలు మరో ఎత్తుగా నిలిచాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరుపున గోమాస శ్రీనివాస్ ప్రభావం చూపించినా, టీఆర్ ఎస్ సెంటిమెంట్ ముందు ఓటమి ముంగిట నిలిచారు. కానీ ఇప్పటి పరిస్థితులు మరోలా మారి, బీజేపీ లేపిన సెంటిమెంట్ తో గోమాస బయట పడే అవకాశం 90 శాతంగా ఉన్నాయి. అసలు బీజేపీ ప్రభావం లేదని, గ్రూప్ తాగదాలతో గెలవదు అనే స్థాయి నుండి అందరి చూపు పెద్దపల్లి పార్లమెంట్ పై దృష్టి సారించేలా చేశాయి. ఈసారి గెలిస్తే గోమాసకు మంత్రి పదవి ఖాయంగా చర్చలు జోరందుకున్నాయి. పెద్దపల్లి మరోసారి ఢిల్లీలో వార్తల్లోకి రానున్నదని రాజకీయ విశ్లేషకుల భావన. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఓటర్ల తీర్పును అందరు గౌరవించాల్సిందే…. కాగా మరో ఇరవై రోజుల్లో నాయకుల భవిష్యత్ తెలనున్నది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!