బుగ్గారం సర్పంచ్, పాలక వర్గాన్ని సస్పెండ్ చేయండి
నిధుల దుర్వినియోగానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి
జిల్లా కలెక్టర్ కు పిర్యాదు
జగిత్యాల,
జిల్లా లోని బుగ్గారం జి.పి.లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాలక వర్గాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి కోర్ కమిటి కో చైర్మన్ పెద్ధనవేని రాగన్న లు సోమవారం
జగిత్యాల జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగాయన్నారు. పలు సార్లు విచారణ జరిపిన అధికారులు 11 చలాన్ ల ద్వారా రూ.4,58,924 -00 లు రికవరీ కూడా చేశారని వారు పిర్యాదు లో సూచించారు. నిధుల దుర్వినియోగానికి సహకరించి తప్పుడు, దొంగ తీర్మానాలు చేసిన వార్డు సభ్యులను, పంచాయతీ కార్యదర్శిని, బాధ్యులైన సంబంధిత అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేసి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఆధారాలు లభించినా వృత్తి ధర్మాన్ని మరచి, అత్యంత విలువైన విధులను, వారి అధికారాలను కూడా దుర్వినియోగం చేసి తప్పుడు నివేదికలు అందజేసిన అధికారులపై, ఉన్నతాధికారులపై, ఇతర బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి, పెద్దనవేని రాగన్న లు జిల్లా కలెక్టర్ ను కోరారు. సంబంధిత అధికారులు అవినీతికి పాల్పడే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాకు అనుమానంగా ఉందని వారు ఆరోపించారు. దుర్వినియోగం అయిన మొత్తం సొమ్ము తగు వడ్డీతో సహా రికవరీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.గత నాలుగేళ్లుగా ఈ న్యాయ పోరాటం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.
జి.పి.లో రికార్డులు కూడా మాయం అయ్యాయని విచారణ అధికారులకు రికార్డులు అందజేయ లేదని, షోకాజ్ నోటీసులు కూడా భే ఖాతర్ చేసి ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదని
ఈ నెల 2న గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను ఒక్కరిని మాత్రమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాలం సర్పంచ్ ల హయాంలో
యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే జి.పి.లో ఇంత భారీ మొత్తం నిధుల దుర్వినియోగం బయట పడడం, బాధ్యులు నాలుగేండ్లు గా సస్పెండ్ కాకుండా ఉండడం శోషణీయం. ఈ ఘటన అధికారుల, జిల్లా ఉన్నతాధికారుల ప్రవర్తానా, వారి పని తీరు పలు విమర్శలకు, పలు అనుమానాలకు కూడా తావిస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరో 23 రోజుల్లో సర్పంచ్ ల పదవీ కాలం కూడా ముగియనుంది. ఇప్పటికైనా జగిత్యాల జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకుంటారో…. లేదో… కాస్త వేచి చూడాల్సిందేనని యావత్ ప్రజానీకం ముక్కున వేలేసుకొని ఎదిరి చూస్తున్నారు.