పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి
Suspension of grading system in class 10 examinations
హైదరాబాద్
పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పదో తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. విద్యార్థులకు ఇక నుంచి మెమోలో గ్రేడింగ్‌కు బదులుగా మార్కులు ఉండనున్నాయి.
పదో తరగతి విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి విద్యార్థుల మెమోలో మార్కులకు బదులుగా గ్రేడింగ్‌ను ఇస్తున్నారు.
అంటే 92 నుంచి వంద మార్కులొస్తే ఏ1 గ్రేడ్, 91 నుంచి 83 మార్కులొస్తే ఏ2 గ్రేడ్, 82 నుంచి 75 మార్కులొస్తే బీ1 గ్రేడ్, 74 నుంచి 67 మార్కులొస్తే బీ2 గ్రేడ్, 66 నుంచి 59 మార్కులొస్తే సీ1 గ్రేడ్, 58 నుంచి 51 మార్కులొస్తే సీ2 గ్రేడ్, 50 నుంచి 43 మార్కులొస్తే డీ1 గ్రేడ్, 42 నుంచి 35 మార్కులొస్తే డీ2 గ్రేడ్‌ను కేటాయిస్తారు.
34 అంతకంటే తక్కువ మార్కులొస్తే ఈ గ్రేడ్‌ను కేటాయిస్తారు. అంటే వారు ఫైయిలైనట్టుగా భావించాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు 2010కి ముందు మార్కుల విధానమే మళ్లీ అమల్లోకి రానుంది. ప్రస్తుత విద్యాసం వత్సరం నుంచి వంద మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి సబ్జెక్టులోనూ ఇంటర్నల్ అసైన్‌మెంట్స్ పేరుతో 20 మార్కులను కలిపే విధానాన్ని ఎత్తేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వాలనే మరో నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మరో ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటివరకూ పదోతరగతి పబ్లిక్ పరీక్షలను ఎస్‌ఎస్‌సీ బోర్డు 80 మార్కులకు నిర్వహిస్తున్నది.
ఇంటర్నల్ అసైన్‌మెంట్స్ పేరుతో పాఠశాలలే విద్యా ర్థులకు 20 మార్కులను ఇస్తాయి. ఈసారి అలాకా కుండా వంద మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ మెయిన్ ఆన్సర్ షీట్,నాలుగు పేజీలుతో పాటు అదనంగా నాలుగు పేజీల ఆన్సర్ షీట్ ఇస్తున్న విషయం విదితమే.
ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల నుంచి సైన్స్ మినహా మిగతా ఐదు పరీక్షలకు 24 పేజీల ఒకే బుక్‌లెట్‌ను ఇవ్వనున్నారు. ఫిజికల్ సైన్స్, బయలా జికల్ సైన్స్ పేపర్లకు మాత్రం 12 పేజీల చొప్పున వేర్వేరుగా బుక్‌లెట్‌లను ఇవ్వనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు-2025 నుంచే ఈ విధానం రాష్ట్రంలో అమ ల్లోకి రానుంది. ఈ మేరకు డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు, పదోతరగతి విద్యార్థులకు విద్యాశాఖ సమాచారాన్ని పంపింది.