రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

- Advertisement -

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

Swachh Bharat program at Rajanna Sircilla district headquarters

రాజన్న సిరిసిల్ల జిల్లా (సెప్టెంబర్ 19) వాయిస్ టుడే

Swachh Bharat program at Rajanna Sircilla district headquarters
Swachh Bharat program at Rajanna Sircilla district headquarters

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో, సేవా పక్షం లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం రెండవ వార్డ్, శ్రీనగర్ కాలనీ
రోడ్డుచౌరస్తా వద్ద నిర్వహించారు.
కార్యక్రమంలో గుంతలు పూడ్చడం, మొక్కలు నాటడం, పిచ్చి మొక్కలు, పనికిరాని కలుపు మొక్కలను తొలగించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల ఆరోగ్య భద్రత, పట్టణ శుభ్రత పట్ల భాజపా ఎంత కట్టుబడి ఉందో అని అన్నారు.
సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ,ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కృత స్వచ్ఛ భారత్ మిషన్‌ ను భాజపా కేవలం నినాదంగా కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఉద్యమంగా కొనసాగిస్తోంది. పట్టణ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారం మా ప్రధాన ధ్యేయం. ప్రజల పన్నులతో ఏర్పడిన మౌలిక వసతులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. గుంతలు పూడ్చడం, చెత్త తొలగించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు శుభ్రతకే కాదు, ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణ రక్షణకూ ఉపయోగపడతాయి. బీజేపీ మాట ఇచ్చినదాన్ని తప్పక అమలు చేస్తుంది. సిరిసిల్ల పట్టణాన్ని శుభ్రమైన, అభివృద్ధి చెందిన మోడల్ పట్టణంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, జిల్లా కార్యదర్శి కర్నే హరీష్, మహిళా మోర్చా నాయకురాలు వేముల వైశాలి, పండుగ మాధవి, పట్టణ ఉపాధ్యక్షులు మోర శ్రీహరి, అంకారపు రాజు, నరసయ్య దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, కార్యదర్శి సూరం వినయ్, నాయకులు చొక్కి శ్రీనివాస్, వడ్నాలశేఖర్ పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular