- Advertisement -
పరవాడలో స్వచ్ఛత హి సేవ ర్యాలీ
Swachhata Hi Seva rally in Paravadaపరవాడ,
పరవాడలో మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా అధికారి,పరవాడ ఎమ్పిడివో హేమసుందర్ రావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, అతిసార మలేరియా వ్యాధుల నివారణకు ముఖ్యంగా ప్రజలు పరిశుభ్రతను పాటించాలని పారిశుద్ధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూ సూచించారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు.ఈ కార్యక్రమం గ్రామంలో సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమంలు నిర్వహించడం జరుగుతుంది అని పరవాడ సెక్రటరీ అచ్యుతరావు తెలియజేసారు.
- Advertisement -




