- Advertisement -
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన స్వామిజీ
సంగారెడ్డి
మంత్రి శ్రీధర్ బాబు ను విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కలిసారు. కోకాపేట శారదాపీఠంలో జరిగే ఉగాది ఆస్థానానికి రావాలని ఆహ్వానించారు. శ్రీరామనవమి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. శారదాపీఠం సమస్యను వెంటనే పరిష్కరించిన సీఎం రేవంత్కు స్వామిజీ అభినందనలు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపిన శ్రీధర్ బాబుకు అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు. సమావేశంలో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గోన్నారు
- Advertisement -



