- Advertisement -
కొండపోచమ్మల సాగర్ లో గజ ఈతగాళ్లతో గాలింపు
Swimming in Kondapochammala Sagar with yard swimmersసిద్దిపేట
కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ వెల్లడించారు. హైదరాబాద్ పట్టణానికి చెందిన యువకులు ఒక వాహనంలో రోడ్డు వైపు వెళ్ళుచుండగా కొండపోచమ్మ సాగర్ కట్ట కనబడినందున చూడడానికి వచ్చిన యువకులు అందులోకి దిగి గల్లంతయినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుంది. జిల్లాలో ఉన్న గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, వెంట సిద్దిపేట గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, తదితరులు వున్నారు. .
గల్లంతైన వారిలో దినేశ్వర్ మృతదేహాన్ని శనివారం మద్యాహ్నం ఇప్పుడే గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.
- Advertisement -




