Thursday, May 21, 2026

కింగ్100 మూవీ లో జాయిన్ అయిన టబు

- Advertisement -

కింగ్100 మూవీ లో జాయిన్ అయిన టబు

Tabu joins King 100 movie

కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై  ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.నాగార్జున–టబు కాంబినేషన్ లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ‘శిశింద్రీ’లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు: కింగ్ నాగార్జున, టబు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్