- Advertisement -
మాంసాహార ప్యాకెట్లు పంచిన వారిపై చర్యలు తీసుకోండి
Take action against those who distribute meat packets
ఈవో వినోద్ రెడ్డి
వేములవాడ
రాజన్న ఆలయ సన్నిధిలో సంప్రోక్షణ కార్యక్రమం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ప్రకటన విడుదల చేసిన ఆలయ ఈవో వినోద్ రెడ్డి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బుధవారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు మాంసాహారంతో కూడిన భోజన ప్యాకెట్లను అందివ్వడం వల్ల ఆలయ కార్య నిర్వహణ అధికారి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో దీనిపై బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హిందూ మతానికి చెందిన భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లడం పట్ల రాజన్న ఆలయ సన్నిది తో పాటు గుడి చెరువు పరిసరాలు, ఆలయ పశ్చిమ వైపున ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో పుణ్య వచన, సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అన్నారు.
- Advertisement -