కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం జరుగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటర్ సవరణ కార్యక్రమం 2024 లో భాగంగా 23వ డివిజన్లో ఉన్న బిషప్ హాజరయ్యారు. స్కూల్లో గల 190 నుండి 197 పోలింగ్ కేంద్రాలు, రైల్వే ఫంక్షన్ హాల్లో గల 155 పోలింగ్ కేంద్రాలను పర్యటించి ఓటర్ల సవరణ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అని పరిశీలించారు.
80 సెంట్రల్ నియోజకవర్గం ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నిర్వహిస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ కార్యక్రమం 2024, శనివారం మరియు ఆదివారం జరుగుతున్న సందర్భoగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న బిఎల్వోలు, బిఎల్ఎల పనితీరును పరిశీలించారు. ఓటర్ల లిస్టులు, మ్యాపులు బిఎల్వోలు తమ దగ్గర ఉంచుకొని సవరణ సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని బిఎల్వోలకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల 80 సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 1 నుండి 257 పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ కార్యక్రమం 2024ను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని, ఈ రెండు రోజులు బూత్ లెవెల్ అధికారి ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని, స్థానిక ప్రజలు సంబంధిత పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటర్ జాబితాను పరిశీలించుకోవాల్సిందిగా కోరారు. కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలన్న, ఓటర్ జాబితాలో తప్పులు, మరణించిన, వేరే ప్రదేశమునకు మారిపోయిన, సంబంధిత ఫారంను పూర్తిచేసి బూత్ లెవెల్ అధికారికి ఇవ్వవలసిందిగా తెలిపారు.