ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్

జగిత్యాల

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్ అన్నారు.  శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో దళితబందు లబ్దిదారుల వ్యాపార సంస్థలను తనిఖీ చేసినారు. దళిత బంధు పథకం క్రింద మంజూరైన మొబైల్ టిఫిన్ సెంటర్, చెప్పుల దుకాణం, లేడీస్ ఎంపోరియం ల  వ్యాపారం చేస్తున్న లబ్దిదారుల యూనిట్లను ఆయన పరిశీలించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల వారికోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని కోరారు. వారి వ్యాపారం, ఇప్పటివరకు సంపాదించిన మొత్తం, భవిష్యత్ వ్యాపార వృద్ది తదితర అంశాలపై ఆయన లబ్ధిదారులతో చర్చించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మీ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular