Wednesday, October 16, 2024

ట్యాంపరింగ్ సాధ్యం కాదు..

- Advertisement -

ట్యాంపరింగ్ సాధ్యం కాదు..

Tampering is not possible..

క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్
న్యూఢిల్లీ, అక్టోబరు 15, (వాయిస్ టుడే)
మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్‌ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్‌ నేత రషీద్‌ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్‌.. కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని.. వీటిలో ఎన్నికల సంఘం ప్రమేయం ఉండదంటూ స్పష్టంచేశారు. ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటనలో స్వీయనియంత్రణ అవసరమన్న సీఈసీ.. ఎగ్జిట్‌పోల్స్‌ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమన్నారు. ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనని.. సీఈసీ మండిపడ్డరాు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని.. 6 నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవిఎంలు ఉపయోగిస్తామని సీఈసీ పేర్కొన్నారు. పోలింగ్‌కు 5రోజుల ముందే బ్యాటరీలు అమరుస్తామని.. మూడెంచల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయన్నారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని.. ఈవీఎంలలో బ్యాటరీలు ఒకేసారి ఉపయోగిస్తామని వివరించారు.. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ తోపాటు.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 15-30 నిమిషాలలోపు టీవీ ఛానెల్‌లలో చూపించిన ముందస్తు ట్రెండ్‌లను కూడా నమ్మవద్దని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. 9.30 తర్వాత అసలైన ట్రెండ్స్ వెలువడతాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ కారణంగా వక్రీకరణ, స్వీయ ఆత్మపరిశీలన అవసరం అంటూ పేర్కొన్నారు.కాగా.. హర్యానాలో ఓటమి షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్న కాంగ్రెస్‌, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై మరింత ఫోకస్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌నేత రషీద్‌ అల్వీ సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌కు, మోదీకి, EVMకి లింక్‌ పెట్టి, కాంగ్రెస్‌ నేత రషీద్‌ అల్వీ పొలిటికల్‌ బాంబింగ్‌ చేశారు. ఈవీఎం టెక్నాలజీలో ఇజ్రాయెల్‌కు మంచి నైపుణ్యం ఉందని, ప్రధానికి ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈవీఎంల ఆట ఎక్కడినుంచైనా ఆడవచ్చనీ, ఎన్నికల ముందే బీజేపీ ఇదంతా చేస్తుందని రషీద్‌ అల్వీ అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్‌ ఆరోపణలకు కేంద్ర ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈవీఎంలపై వివరణ ఇచ్చిన కేంద్ర ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌.. ఈవీఎంలలో లోపాలు లేవనీ, 100శాతం సేఫ్‌ అని చెప్పారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్‌ ఆరోపణలకు బీజేపీ నేత షెహజాద్‌ పూనావాలా కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించిందని పూనావాలా వ్యాఖ్యానించారు. పేజర్లలా ఈవిఎంలను హ్యాక్‌ చేయవచ్చని కాంగ్రెస్‌ అంటోందని తప్పుబట్టారు.. తెలంగాణ, కర్నాటకల్లో గెలిచినపుడు మాత్రం EVMల మీద కాంగ్రెస్‌ ఆరోపణలు చేయలేదన్నారు.ఓటమి అంచున నిలబడిన కాంగ్రెస్‌, తమ నాయకుడు రాహుల్‌ను కాపాడటానికే ఈవిఎంలపై నిందలేస్తోందని పూనావాలా విమర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్