తానాకాన్ 2025 – బ్రోచర్ ఆవిష్కరణ
Tanacon 2025 - Brochure Launch
వాయిస్ టుడే
కరీంనగర్ మే 12
తానా కాన్ – 2025 తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 2025వ సంవత్సరానికి గాను కరీంనగర్ లోనీ స్థానిక ప్రతిమ హోటల్ నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి జరుగుతున్న సన్నాహకాలలో భాగంగా ఈరోజు తానాకాన్ 2025 బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ మాట్లాడుతూ మే నెల 24 25 తేదీలలో టి హెచ్ ఎ ఎన్ ఎ జ 2 కు సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల తానా లీడర్స్ సంయుక్తంగా తానాకాన్ 2025 ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి స్థానిక ప్రతిమ హోటల్ నందు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు. ఇట్టి కాన్ఫరెన్స్ నందు మే 24వ తేదీ రోజున సి ఎం ఈ (కంటిన్యూవస్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మే 25 వ తేదీ రోజున మధ్య చిన్న తరహా హాస్పిటల్ సమస్యల పైన చర్చించడం జరుగుతుందని ఇందులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ( సి ఈ ఏ), హాస్పిటల్ పర్మిషన్స్ (న్యూ అండ్ రెన్యువల్) ., పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రేడ్ లైసెన్స్, ఎస్. టి. పి., తదితర హాస్పిటల్ సమస్యల పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నాలుగు సీఎం ఈ క్రెడిట్ పాయింట్స్ ప్రతి డాక్టర్ కి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చాట్ల శ్రీధర్ సివిఎం హాస్పిటల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజకుమార్ ఆర్ కే హాస్పిటల్ 25 26వ తేదీలకు కార్యక్రమ ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కటారి సాగర హాస్పిటల్, వైస్ చైర్మన్ డాక్టర్ మహేందర్ బాబు, డాక్టర్ సునీల్ బాబు, డాక్టర్ మంజుల, డాక్టర్ శేషశైలజ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమము నందు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, డాక్టర్ చాట్ల శ్రీధర్, డాక్టర్ రాజకుమార్, డాక్టర్ జగన్మోహన్రావు, డాక్టర్ నరేష్, డాక్టర్ శేష శైలజ, డాక్టర్ రవికాంత్, డాక్టర్ మహేష్, డాక్టర్ నవీన్, డాక్టర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


