Friday, April 3, 2026

టార్గెట్ హరీష్ రావు…

- Advertisement -

టార్గెట్ హరీష్ రావు…
హైదరాబాద్, ఏప్రిల్ 3, (వాయిస్ టుడే)

Target: Harish Rao…
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నాయి. నిన్నటి వరకు కేటీఆర్, కవితలపైనే విమర్శనాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు

తన రూటు మార్చి హరీష్ రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హరీష్ రావుపై భూకబ్జా ఆరోపణలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక

పెద్ద రాజకీయ వ్యూహమే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.రేవంత్ రెడ్డి నేరుగా పేరు ఎత్తకపోయినా, హరీష్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. ముఖ్యంగా కన్న తండ్రిని

పట్టించుకోని వారు.. ప్రజలను ఏం పట్టించుకుంటారు  అనే అర్థం వచ్చేలా రేవంత్ చేసిన ఆరోపణలు హరీష్ రావును తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుపై

ఇలాంటి వ్యక్తిగత , అవినీతి ఆరోపణలు రావడం ఆయన ఇమేజ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే హరీష్ అనుచరులు, ఆయనకు సంబంధించిన భూ వ్యవహారాలపై విచారణకు ఆదేశించడం ఆయనను

మరింత ఒత్తిడిలోకి నెట్టింది.ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొత్త ట్విస్ట్‌ను ఇచ్చాయి. రేవంత్ రెడ్డి కావాలనే హరీష్ రావును ఒంటరిని చేస్తున్నారని, కేటీఆర్ మరియు కవితలతో

రేవంత్ కున్న రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ వ్యూహం నడుస్తోందని సంజయ్ ఆరోపించారు. అంటే, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత

విభేదాలను రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నది బీజేపీ వాదన. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉన్నా, రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హరీష్ పై పడటం వెనుక బీఆర్ఎస్ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే ప్లాన్

స్పష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతానికి పరిస్థితులు హరీష్ రావుకు వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వపరంగా విచారణలు, ఇటు రాజకీయంగా సొంత పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిపోతోందన్న ప్రచారం

ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే హరీష్ రావుపై ఈ స్థాయిలో దాడులు జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. హరీష్ రావుకు ఉన్న

మాస్ ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్‌ను బలహీనపరచవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఎన్నికల సమయంలో లేదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షోభాలను చక్కదిద్దే హరీష్ రావు, ఇప్పుడు తన సొంత

రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హరీష్ రావు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ,

ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. కానీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీజేపీ నేతల విమర్శల మధ్య ఆయన తన పట్టును ఎలా నిలుపుకుంటారో చూడాలి.రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్

రావు పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే, మరోవైపు తనపై వస్తున్న అవినీతి మరకలను తొలగించుకోవాల్సిన బాధ్యత హరీష్ పై ఉంది. రేవంత్ రెడ్డి

చేస్తున్న ఈ మైండ్ గేమ్ ‘ బీఆర్ఎస్‌లో చీలిక తెస్తుందా లేక హరీష్ రావును మరింత బలమైన నేతగా మారుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్