Sunday, September 8, 2024

సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త

- Advertisement -

సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం
సైబర్ నేరాలకు చెక్
సైబర్ నేరాలకు గురైనవారు ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయండి..!
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల

జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటూ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని, సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ  తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.
మన బలహీనతనే సైబర్ నేరగాళ్ల బలం అని తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవడం మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటిపి షేర్ చేయడం, ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతకడం, ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం, మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ పెరితో ఎరవేసి క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఊడ్చేస్తారని, ఇలాంటి సైబర్ మోసాలు ఎక్కవగా  జరుగుతున్నయని, ఇట్టి సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సైబర్ మోసగాల్లో చేతిలో మోసపోయిన బాధితుల కోసం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వారియర్స్ ని నియమించడం జరిగిందని సైబర్ నేరాలకు గురైనవారు నేరుగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయలని తెలిపారు.
జిల్లాలో వారం రోజుల వ్యవధిలో వ్యవధిలో నమోదైన  సైబర్ కేసులు.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి క్రిప్టో కరెన్సీ గురించి మరియు ట్రేడింగ్ గురించి సలహాలు ఇస్తామని చెప్పి వాట్సాప్ లో ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అది చూసి నిజమే అనుకొని వాళ్లతో కాంటాక్ట్ అవ్వగా ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి ట్రేడింగ్ గురించి సలహాలు ఇస్తూ ఒక  ఆప్ లో ఇన్స్టాల్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తాయని నమ్మించి ఒక ఫేక్ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత విదిరా చేసుకుందామంటే ఇవ్వలేదు బాధితుడు 2,62,000 నష్టపోయాడు.
వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రేడింగ్ గురించి సలహాలు ఇస్తామని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ చేసి మొదటగా ట్రేడింగ్ ఒక యాప్ లో ఇన్వెస్ట్ చేపించగా కొంత తక్కువ అమౌంట్ను రిటర్న్ ఇవ్వడం జరిగింది దాంతో అది నిజమైన ట్రేడింగ్ యాప్ అనుకొని బాధితులు అందులో ఇన్వెస్ట్ చేసి దాదాపుగా 28,75, 000 వేల రూపాయలు నష్టపోయారు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫేస్బుక్లో బైక్ అమ్ముతారు అని చూసి వాళ్లకు కాంటాక్ట్ అవ్వగా బైక్ ని తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి చాట్ చేసి రూపంలో వివిధ చాట్ చేశాను చెప్పి బాధితులు వద్ద నుంచి దాదాపుగా 44,500 రూపాయలు తీసుకోవడం జరిగింది.-తర్వాత బాధితునికి ఫ్రాడ్ అని  తెలిసి 44,500 రూపాయలు నష్టపోయారు.
సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.*పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్